![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -359లో. జరుగుతున్న వాటికి మాకు ఏ సంబంధం లేదని తేలుతుంది కాబట్టి ఆ పెళ్లి ఆగిపోతుందని కృష్ణ కాన్ఫిడెంట్ గా చెప్తుంటే భవాని వింటుంది. ఆ తర్వాత భవాని గదిలోకి వెళ్లి కృష్ణ మురారిలు మాట్లాడిన విషయాలు గుర్తుకుచేసుకొని ఒకవేళ నేనే తప్పు చేస్తున్నానా అని అనుకుంటుంది. మళ్ళీ నేనేం తప్పు చెయ్యట్లేదని అనుకుంటుంది.
అ తర్వాత భవాని దగ్గరకి శకుంతల వచ్చి మీ ఆలోచనని మార్చుకోండని బ్రతిమిలాడుతుంది. అయిన భవాని కఠినంగా మాట్లాడుతుంది. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. ఇక్కడ నుండి వెళ్ళమని చెప్తుంది. దాంతో శకుంతల అక్కడ నుండి వెళ్లిపోతుంది. మరొకవైపు మురారికి తలనొప్పిగా ఉందని అనడంతో కృష్ణ వచ్చి మురారికి హెడ్ మసాజ్ చేస్తుంది. అప్పుడే శకుంతల వస్తుంది. శకుంతల బాధగా రావడం చూసి.. ఏమైందని కృష్ణ అడుగుతుంది. భవాని దగ్గరాకి వెళ్లిన విషయం చెప్తుంది. నువ్వు ఇంకొకసారి అలా వెళ్ళకని శకుంతలకి కృష్ణ చెప్తుంది. మరొకవైపు దేవ్ వేలికి ఉన్న రింగ్ ని ముకుంద చూసి ఎప్పుడు తీసుకున్నావని అడుగుతుంది. గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిందని దేవ్ చెప్తాడు. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్ అంటుంది కానీ నాకు ఇంట్రస్ట్ లేదు. ఎప్పుడు బ్రేకప్ అవుతుందో తెలియదు. అడ్జెస్ట్ అవడం నా వాళ్ళ కాదని దేవ్ అంటాడు. అందరూ భోజనం చెయ్యడానికి వస్తారు. కృష్ణ , మురారి కూడా వస్తారు. దేవ్ భోజనం చేస్తుండగా తన వేలికి ఉన్నా రింగ్ చూసిన కృష్ణ షాక్ అవుతుంది. మళ్ళీ ఆ రింగ్ ఈ రింగ్ అయి ఉండదులే అనుకుంటుంది. రేపు ముకుంద, మురారీలకి నలుగు పెడుతున్నామని భవాని అంటుంది.
ఆ తర్వాత ముకుందకి పెళ్లి చేస్తున్నారన్న హ్యాపీలో ఉన్నా కానీ నా చెల్లె కృష్ణకి అన్యాయం జరుగుతుందన్న బాధలో తిండి కూడా తినాలి అనిపించడం లేదని దేవ్ అంటాడు. ఏం అన్నావ్ కృష్ణ నీ చెల్లెలు అన్నావ్ కదా.. నా ప్రాబ్లమ్ కి సొల్యూషన్ దొరికింది. నీ కృష్ణ చెల్లె ఇంట్లోనే ముకుందకి నలుగు పెడతానని భవాని అనగానే కృష్ణ ఏడుస్తూ అక్కడ నుండి వెళ్లిపోతుంది. తన వెనకలే మురారి కూడా వెళ్తాడు. ఆ తర్వాత కృష్ణ బాధపడుతుంటే మురారి తన బాధని పోగొట్టేల మాట్లాడతాడు. తరువాయి భాగంలో ముకుంద, మురారీలకి నలగు పెడుతుంటారు. అప్పుడే శ్రీధర్ ని చంపిన వాళ్లలో ఒకరు దొరికారంట అని భవానికి మురారి చెప్తాడు. ముకుంద టెన్షన్ పడుతుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |